కొన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో మాత్రం వెనక్కి తగ్గడం లేదు సీఎం వైఎస్ జగన్.. కష్టకాలంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేసి లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న సీఎం.. ఇప్పుడు మత్స్యకార కుటుంబాలకు శుభవార్త చెప్పారు.. రేపు మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు.. వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా సొమ్మును లబ్ధిదారులకు అందజేయనున్నారు.. కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో మత్స్యకార భరోసా కార్యక్రమంలో.. శుక్రవారం పాల్గొననున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Chandrababu: తప్పుడు కేసులు పెట్టినవారిపై దర్యాప్తు చేయిస్తా..!
రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఆర్ధిక సహాయం చేయనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. దీని కోసం రూ. 109 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక, ఓఎన్‌జీసీ సంస్ధ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించనుంది ఏపీ సర్కార్.. వారికి రూ. 108 కోట్ల ఆర్ధిక సాయం అందించనున్నారు సీఎం జగన్.. మొత్తం రూ. 217 కోట్లు రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
