Site icon NTV Telugu

CM YS Jagan: పార్టీ పటిష్టతపై సీఎం జగన్‌ ఫోకస్‌.. 2వ తేదీన కీలక భేటీ..

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: మరోసారి వైసీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే ప్రజాప్రతినిధులంతా ప్రజల మధ్య ఉండేలా.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన.. మధ్యలో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.. పార్టీ కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల ప్రచారం వెనుకబడిన నేతలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.. ఈ సారి టార్గెట్‌ 175.. మొత్తం సీట్లు గెలవాల్సిందే.. అందరూ కలిసి పనిచేస్తేనే అది సాధ్యమని.. నేను ఒక్కడినే కాదు.. మనమంతా కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని.. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.. ఇక, వచ్చే నెలలో కీకల సమావేశానికి సిద్ధమయ్యారు పార్టీ అధినేత వైఎస్‌ జగన్.

Read Also: RTC Driver: ఆర్టీసీ డ్రైవర్ సాహసం..నదిలో కొట్టుకుపోతున్న సిస్టర్స్‌ను కాపాడాడు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతపై ఫోకస్‌ పెట్టిన సీఎం జగన్‌.. వచ్చే నెల (ఫిబ్రవరి) 2వ తేదీన పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల ఎంపిక ప్రక్రియను సమీక్షించనున్నారు.. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల ఎంపికకు ఈ రోజుతో గడువు ముగిసిన నేపథ్యంలో.. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.. మరోవైపు.. ఫిబ్రవరి మొదటి వారంలో మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తోంది వైసీపీ.. వచ్చే నెలలో మరికొన్ని కొత్త కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టే దిశగా కసరత్తు జరుగుతోంది.. ఈ సమయంలో.. జరగనున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. కాగా, ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వరుస సమావేశాలతో వైసీపీ జోష్ పెంచుతోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 2వ తేదీన కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version