CM YS Jagan Says YCP Govt Ready To Pay Students Fee: విజయవాడలో నిర్వహించిన ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమంలో.. చదువు కోసం తమ వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరిస్తుందని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మట్టి నుండి గడ్డిగా పెరిగిన ఈ మొక్కలు.. ప్రపంచానికి అభివృద్ధి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను మరింతగా మార్చాలని అనిపిస్తోందని.. జగనన్న గోరుముద్దలోనూ మార్పులు చేశామని తెలిపారు. మొదటిసారి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే.. తొలిసారి బైజూస్ కంటెంట్ కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. మూడవ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమిస్తున్నామన్నారు.
Ntr : రాంచరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్..
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడక తప్పని పరిస్థితిలు ఏర్పడుతున్నాయని అన్నారు. ‘జగన్ మామ’ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు వస్తున్నాయని, ప్రతీ విద్యార్థి కనీసం డిగ్రీ చదవాలని చెప్పారు. విదేశీ యూనివర్శటీల్లో సీటు తెచ్చుకుంటే ‘జగన్ మామ’ ప్రభుత్వం చదివిస్తుందని మాటిచ్చారు. కోటి 80 లక్షల రూపాయల వరకు ఫీజు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి రంగంలో మన పిల్లలు ఎదగాలని, ఎగరాలని కోరుకున్నారు. మన పిల్లలు ప్రపంచానికి నాయకత్వం వహించాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను కూడా తీసుకుని వస్తామని.. ఆరోజు దగ్గరలోనే ఉందని ఉద్ఘాటించారు.
పరీక్షా విధానంలోనూ సమూల మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్ చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఛాట్‌జీపీటీ యుగంలో ఉన్నామని.. మనం వేగంగా మారకపోతే, మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలియని పరిస్థితిలు ఏర్పడతాయని హెచ్చరించారు. ర్యాంకులు తెచ్చుకోలేక పోయిన విద్యార్థులు కూడా ముఖ్యమన్న ఆయన.. అరక దున్నినప్పుడే వజ్రాలు బయటకు వస్తాయని విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చదువుపై దృష్టి పెట్టలేదని.. తాము క్వాలిటీ విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టామని అన్నారు. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన పథకాల్ని చేపట్టామని తెలిపారు.