NTV Telugu Site icon

మైనార్టీ సంక్షేమంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

YS Jagan

మైనార్టీ సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.. వక్ఫ్‌ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన.. వక్ఫ్‌ భూములపై పూర్తిస్ధాయిలో అధ్యయనం చేయాలని.. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఆ భూముల చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాలని.. వైయస్సార్‌ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్‌ ఆస్తులు కూడా సర్వే చేయాలి.. అవసరాలకు తగినట్టుగా మైనార్టీలకు కొత్త శ్మశానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఇక, ఇమామ్‌లు, మౌజంలు, ఫాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లింపులు జరగాలి స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. మైనార్టీలకూ సబ్‌ప్లాన్‌ కోసం అధికారుల ప్రతిపాదనలు, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. సబ్‌ప్లాన్‌ అమలు అయితే నిధులు కూడా మరింత పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్‌ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు సీఎం.. అసంపూర్ణంగా నిలిచిపోయిన క్రిస్టియన్‌ భవన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.. షాదీఖానాల నిర్వహణను ఇక నుంచి మైనారిటీశాఖకు బదిలీ చేయాలన్నారు.. కర్నూలులో ఉర్ధూ యూనివర్సిటీ పనులను ప్రాధాన్యత ఇచ్చి చేపట్టాలని సూచించారు సీఎం వైఎస్ జగన్‌.