NTV Telugu Site icon

CM YS Jagan: 2019 నుంచి ఏపీకి రూ.1,81,821 కోట్లు పెట్టుబడులు.. 1,40,903 మందికి ఉద్యోగాలు..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan:2019 జూన్‌ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.1,81,821 కోట్ల పెట్టుబడులురాగా.. 1,40,903 మందికి ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖపట్నంలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లుపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం.. ఈ ఏడాది మార్చి 3–4 తేదీల్లో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు.. పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా సదస్సు జరుగుతుందని వెల్లడించారు.. 2014–2019 మధ్య రాష్ట్రానికి రూ. 18.87 లక్షల కోట్లకు ఎంవోయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్యకాలంలో ఏడాదికి పెట్టుబడులు సగటున రూ.11,994 కోట్లు వచ్చాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, 2019–2022 మధ్య సగటున ఏడాదికి పెట్టుబడులు రూ. 15,693 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు..

Read Also: CM KCR: కుల-మతపిచ్చితో విద్వెషాలు రెచ్చగొడితే.. రాష్ట్రం తాలిబన్ల మాదిరి మారుతుంది

అయితే, వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలన్న ఆయన.. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలన్నారు.. దీనికి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలని.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహించాలన్నారు.. విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామిక వాడలను పరిశీలించాలి.. వాటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి.. ఆ దేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలి.. వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.