NTV Telugu Site icon

G20 Preparatory Conference in Vizag: విశాఖను అందంగా తీర్చిదిద్దాలి.. సీఎం జగన్‌ ఆదేశాలు

G20 Preparatory Conference

G20 Preparatory Conference

G20 Preparatory Conference in Vizag: విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలి.. అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని.. ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులు ఆదేశాలరు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖపట్నంలో జరగనున్న జీ 20 సన్నాహక సదస్సు కోసం ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రపంచ దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరవుతారు.. ఒక్కొక్క జీ 20 సభ్య దేశం నుంచి ఆరుగురు చొప్పున హాజరవుతారని.. అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరుకానున్నారని.. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు వస్తారని.. తెలిపారు.. మార్చి 28–29 మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశం ఉంటుందన్న సీఎం జగన్.. ఒక్క ఈ సమావేశం సందర్భంగానే కాదు, అన్ని రోజుల్లోనూ విశాఖ సిటీ అందంగా ఉండేలా తగిన కార్యాచరణ చేయాలని ఆదేశించారు.

Read Also: CM YS Jagan: 2019 నుంచి ఏపీకి రూ.1,81,821 కోట్లు పెట్టుబడులు.. 1,40,903 మందికి ఉద్యోగాలు..

ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఏర్పాట్లకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.. అయితే, ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు సీఎంకు తెలిపారు అధికారులు. ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలని సీఎం సూంచిచారు.. ఆయా పర్యాటక ప్రదేశాల వద్ద ఆహ్లాదకర పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.. పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.