Site icon NTV Telugu

CM YS Jagan: అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్ట్.. విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా ఉండాలి..

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటికే పలు మార్లు ఆ ప్రాజెక్టు పనులు జరుగుతోన్న తీరుపై సమీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించారు.. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి పైనా సమీక్ష చేశారు.. సివిల్‌ వర్క్స్, సుందరీకరణ పనులపై చర్చించారు.. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎం వైఎస్‌ జగన్‌కు వివరాలందించారు అధికారులు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అన్ని స్లాబ్‌ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయన్న అధికారులు.. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందన్నారు. విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని వివరించారు..

Read Also: AP JAC Amaravati: సర్కార్‌కు జేఏసీ షాక్‌.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు.. పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలన్న ఆయన.. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా అత్యంత ప్రధానమైనది.. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని.. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, అంబేద్కర్‌ విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని.. ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని తెలిపారు అధికారులు.. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎం జగన్‌కు వివరించిన అధికారులు.

Exit mobile version