NTV Telugu Site icon

CM YS Jagan Mohan Reddy: నేడు శ్రీకాకుళంలో సీఎం జగన్‌ పర్యటన

Ys Jagan

Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వ త భూహక్కు, భూరక్ష (రీ సర్వే ) పత్రాల పంపిణీని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఇక, శ్రీకాకుళం జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న ఆయన.. ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు పాల్గొని.. లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు.. ఇక, మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుగు ప్రయాణం కానున్న ఏపీ సీఎం.. సాయంత్రం 3.25 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.. మరోవైపు, సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు జిల్లా పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా నిఘా పెట్టారు.. మరోవైపు, సీఎం పర్యటన నేపథ్యంలో.. విపక్ష నేతలను హైస్‌ అరెస్ట్‌ చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి..

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?