NTV Telugu Site icon

CM YS Jagan: ఉద్యోగుల సంతోషం, భవిష్యత్తు నా బాధ్యత.. నిజాయితీతో అడుగులేశాం

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan Mohan Reddy: విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీఓ మహాసభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు. సంక్షేమం, అభివృద్ధి, సేవాఫలాలు ప్రజలకు తీసుకెళ్ళడంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఉద్యోగులేనని కొనియాడారు. పాలసీలు చేసేది ప్రభుత్వమైతే, అమలు చేసేది మాత్రం ఉద్యోగులేనని పేర్కొన్నారు. ఉద్యోగుల సంతోషం, భవిష్యత్తు తమ ప్రభుత్వ ప్రాధాన్యత, తన బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వ కుటుంబంలో కీలక సభ్యులు ఉద్యోగులని తెలిపారు. గ్రామ స్ధాయిలోనే సేవలు అందుబాటులోకి తెస్తూ.. 1.35 లక్షల శాశ్వత ఉద్యోగాలు ప్రారంభంలోనే ఇఛ్చామని అన్నారు.

Alleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం.. ఉద్రిక్తత..

ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సమస్యలు వస్తాయని వారించినా తాము వెనకడుగు వేయలేదని సీఎం జగన్ చెప్పారు. తాము నిజాయితీ, కమిట్మెంట్‌తో అడుగులేశామన్నారు. పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు వరకూ ఒక్క రూపాయి కూడా జీతం పెరగని వారికి ఈ ప్రభుత్వంలో జీతాలు పెంచామని అన్నారు. ఓట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో గత ప్రభుత్వం జీతాలు ఎన్నికల సమయంలో పెంచిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా.. కొవిడ్ కాలంలో పేదలను బ్రతికించుకున్నామన్నారు. డీబీటీ ద్వారా ప్రజలకు సరాసరి లంచాలకు, వివక్షకు తావివ్వకుండా సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఎవరూ ఊహించని గడ్డుకాలం వచ్చినా.. ఈ ప్రభుత్వం వదిలేయలేదన్నారు.

Donald Trump: భారత్‎కు ట్రంప్ షాక్.. తాను అధ్యక్షుడైతే భారతీయ ఉత్పత్తులపై భారీ పన్ను

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బ్రతికించి, 55వేల ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. 1998-2008 డీఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం చేయలేదన్నారు. ఉద్యోగులందరికీ తోడుగా నిలబడ్డామని.. ప్రభుత్వ ఉద్యోగులపై మమకారం ఉన్న ప్రభుత్వం తమదని అన్నారు. ప్రతీ గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో.. గ్రామస్ధాయిలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయన్నారు. గ్రామస్ధాయిలోనే ఇంగ్లీషు మీడియం బడులన్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవోను కొంత మార్పు చేసి 2014 జూన్ కటాఫ్‌ను తొలగించామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు మంచి చేశామని చెప్పుకొచ్చారు.