NTV Telugu Site icon

CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Ys Jagan Review Meeting

Ys Jagan Review Meeting

CM YS Jagan Mohan Reddy Review Meeting On Medical Health Department: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు (27-01-23) క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి విడదల రజిని, ఏపీ సీఎస్‌ జవహార్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సందర్భంగా.. సీఎం జగన్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలన్నారు. డేటా అనుసంధానత ఉండాలని సూచించారు. స్కూల్స్, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్నారు. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ప్రతి రోజూ దీని పై సమీక్ష చేయాలని పేర్కొన్నారు. జిల్లాల్లోని కలెక్టర్లు కూడా దీనిపై పర్యవేక్షణ చేయాలని ఆదేశాలిచ్చారు.

Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు

ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి కుటుంబాన్ని కలిసి.. విలేజ్‌ క్లినిక్స్‌ సేవలను వివరించాలన్నారు. హైరిస్క్‌గా గుర్తించిన వారిని, ప్రసవం కోసం ముందస్తుగానే మంచి ఆస్పత్రులకు తరలించాలన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. పాలకొండకు సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, ఆస్పత్రిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నారులు, స్కూలు పిల్లల్లో దంత శుభ్రతపై అవగాహన కల్పించాలని.. స్క్రీనింగ్‌ నిర్వహించి వారికి చికిత్స అందించే కార్యక్రమంపై తగిన ఆలోచన చేయాల్నారు. ఆరోగ్య శ్రీ యాప్‌ ప్రారంభానికి సన్నాహాలు చేయాలని అధికారులకు తెలియజేశారు. రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలే లక్ష్యంగా యాప్‌ ఉండాలని చెప్పారు.

Kodali Nani: లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ అమలు చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలని సూచించారు. మార్చి 1వ తేదీ నుంచే ‘గోరుముద్ద’లో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాలని చెప్పారు. అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో.. క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.