AP New Industrial Policy: నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. నూతన పారిశ్రామిక విధానంపై ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.. పరిశ్రమల స్థాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని ఆదేశించిన ఆయన.. మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయంగా మార్కెటింగ్ టై అప్ చేయగలిగితే ఎంఎస్‌ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతాం అన్నారు.. ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయన్నారు.
Read Also: Harirama Jogaiah: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. కాపులపై వైసీపీ చిన్నచూపు..!
ఇక, కాన్సెప్ట్, కమిషనింగ్, మార్కెటింగ్ వరకు హేండ్ హోల్డింగ్‌గా ఉండాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్‌గా ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలన్నారు. స్టార్టప్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.. విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని.. మంచి లొకేషన్‌లో భవనాన్ని నిర్మించాలని సూచించారు.. అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాయం కూడా ఉండాలి.. స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పన దిశగా దృష్టి సారించాలని.. ఈ అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది ఏపీ ప్రభుత్వం.. కొత్తగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవాళ్లకు ఆఫర్లు కూడా ఇస్తున్న విషయం విదితమే.
