మహా శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది.. ఇక, మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ‘పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి.. ఈ పరమ పవిత్రమైన రోజున ముక్కంటి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
YS Jagan: ఏపీ సీఎం మహా శివరాత్రి శుభాకాంక్షలు
