NTV Telugu Site icon

CM Jagan: నేడు కడపలో సీఎం జగన్ మూడో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే!

Jagan Kadapa Tour

Jagan Kadapa Tour

CM YS Jagan Kadapa Tour Third Day Schedule: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో మూడో రోజు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తొలుత సీఎం ఉదయం ఇడుపులపాయ నుంచి కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9:25 నుంచి 10 గంటల వరకు ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం 10 గంటలకు రాజీవ్ మార్గ్ రోడ్డు, రాజీవ్ పార్కు అభివృద్ధి పనుల్ని ప్రారంభించనున్నారు. 10:50 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి.. 11:00 గంటలకు కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

Adipurush: యూట్యూబ్‌లో లీక్ అయిన ఆదిపురుష్.. కొన్ని గంటల్లోనే 2 మిలియన్ల వ్యూస్

అక్కడి నుంచి 11:10 గంటలకు అల్‌డిక్సన్ యూనిట్‌కి చేరుకుని.. ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత 11.35 నుంచి 11.45 గంటల వరకు పారిశ్రామిక యూనిట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో గడుపుతారు. ఆ కార్యక్రమాల్ని ముగించుకున్నాక.. 11.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, 12.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 12.15 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. 1.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. సీఎం జగన్ మూడో రోజు పర్యటనలో భాగంగా.. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రాంతాల్లో ఎలాంటి అవాంతర సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Ghaziabad: అమ్మాయిలను మతం మారాలంటూ ఒత్తిడి చేశారు.. దొరికిపోయారు

అంతకుముందు రెండో రోజు పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మూడు చోట్ల సెవెన్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణాలకు గండికోటలో భూమిపూజ చేశారు. గండికోట, తిరుపతి, విశాఖలో వీటిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో ఒబెరాయ్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టడం సంతోషమని, ఒబెరాయ్‌ గ్రూప్‌ ఇక్కడ సెవెన్‌ స్టార్‌ హోటల్‌ కడుతోందని అన్నారు. ఒబెరాయ్‌ సంస్థ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.