NTV Telugu Site icon

CM YS Jagan: రేపు సీఎం జగన్ గుంటూరు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Ys Jagan Tour

Ys Jagan Tour

CM YS Jagan Guntur Tour Schedule: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. తొలుత గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని.. అక్కడ నుంచి చుట్టుగుంటకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Aunty Video Call: ఆంటీ మత్తులో అతను.. వీడియో కాల్ లో బట్టలు విప్పి

మరోవైపు.. బాణసంచా గోడౌన్‌ ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలకు సీఎం జగన్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులు మృతుల కుటుంబాలకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కాగా.. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం ఎల్లకటవ గ్రామంలో.. ఓ బాణసంచా గోడౌన్‌లో ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే! భారీ పేలుడు సంభవించడంతో.. ముగ్గురు మృతిచెందారు. ఈ విషాదం గురించి తెలిసిన వెంటనే.. సీఎం స్పందిస్తూ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆయా కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

Extramarital Affair: భర్తని వదిలి ఫోన్‌లో పరిచయమైన వ్యక్తితో సహజీవనం.. ఆ తర్వాత?