Site icon NTV Telugu

CM YS Jagan Delhi Tour: మరోసారి ఢిల్లీకి ఏపీ సీఎం..

Ys Jagan

Ys Jagan

CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నారు.. ఈ నెలలోనే సీఎం ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి.. ఈ నెల 16వ తేదీన ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయిన విషయం విదితమే.. ఇక, మరోసారి హఠాత్తుగా రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.. ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్న ఆయన.. జీ20 సదస్సులో పాల్గొననున్నారు.. సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.. విదేశీప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్న సీఎం.. జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రసంగించే అవకాశం ఉంది.. రాత్రి 8.35 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.. ఇక, రేపు సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.. రాత్రికి అక్కడే బస చేసి.. మర్నాడు తిరిగి రాష్ట్రానికి రానున్నారని తెలుస్తోంది.. అయితే, ఈ పర్యటనలో ఎవరితో సమావేశం కానున్నారు.. ఏ అంశాలపై చర్చిస్తారు అనే పూర్తి వివరాల్లో తెలియాల్సి ఉంది.. అయితే, రెండు వారాల్లోపే రెండోసారి సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడంపై ఉత్కంఠ నెలకొంది.

Read ALso:Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version