వచ్చే ఎన్నికలకు చాలా కీలకంగా తీసుకున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ ఎన్నికలకు చాలా కీలకం.. ఈ ఒక్కసారి మనం గెలిస్తే.. మరో 25 ఏళ్ల వరకు ఎలాంటి సమస్య ఉండదంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. అక్కడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. ఆ నియోజకవర్గానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది అనే విషయాలను కూడా వెల్లడిస్తున్నారు.. ఓవైపు రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకంలో మార్పులు చేర్పులు చేసినప పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మరోవైపు.. పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ కొన్ని మార్పులు చేశారు..
Read Also: YSRCP: వైసీపీ కీలక నిర్ణయం.. రీజనల్ కో-ఆర్డినేటర్ల మార్పు
కొన్ని జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు.. మరికొన్ని చోట్ల జిల్లా అధ్యక్షలను మార్చేశారు సీఎం వైఎస్ జగన్.. కొత్త జాబితా ప్రకారం.. పార్వతీపురం మన్నెం జిల్లాకి అధ్యక్షుడిగా పుష్ప శ్రీవాణి స్థానంలో పరిశిష్ట రాజు.. విశాఖపట్నం జిల్లా బాధ్యతల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను తప్పించి ఆయన స్థానంలో పంచకర్ల రమేష్ కు అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించిన జగన్.. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బుర్ర మధుసూదన్ యాదవ్ స్థానంలో జంకె వెంకటరెడ్డికి అవకాశం ఇచ్చారు.. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మేయర్ బీవై రామయ్యకు బాధ్యతలు అప్పగించగా.. ఇప్పటికే రాజీనామా చేశారు ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి. ఇక, అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పైల నర్సింహయ్య, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భరత్‌ను కొనసాగించారు.. అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
