NTV Telugu Site icon

YS Jagan: గ్రామ సచివాలయాల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్లు..!

ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే 51 గ్రా, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుతుండగా.. ఈ ప్రక్రియలు తలెత్తే సవాళ్ల పరిష్కారంపై ఫోకస్‌ పెడుతోంది సర్కార్‌.. దీనిలో భాగంగా ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్‌ సేవలను సమీక్షించి తగిన మార్పులు, చేర్పులు చేయండి అంటూ.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని స్పష్టం చేశారు.. ఆ మేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్.

Read Also: KCR Birthday: పూరీ జగన్నాథుడి చెంత.. ‘సైకత’ శుభాకాంక్షలు