NTV Telugu Site icon

సొంత జిల్లాలో సీఎం టూర్.. రెండో రోజు షెడ్యూల్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు… ఇవాళ రెండో రోజు కడప జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్న సీఎం.. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు.. ఇక, పులివెందులలో జరగనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రెండో రోజు పర్యటన వివరాలను పరిశీలిస్తే.. ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులోని ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు ఏపీ సీఎం.. పులివెందులలో వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక, పులివెందుల మార్కెట్ యార్డు, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. పులివెందుల రాణితోపు సమీపంలో ఆక్వా హబ్‌ను ప్రారంభిస్తారు సీఎం వైఎస్‌ జగన్.