Site icon NTV Telugu

వరదల నష్టానికి ఆదుకోవాలని ప్రధానికి సీఎం జగన్ లేఖ…

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసారు. రాష్ట్రంలో వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టానికి ఆదుకోవాలని లేఖలో కోరారు సీఎం జగన్. ప్రాధమిక నష్ట అంచనాల నివేదికను అందులో పొందుపర్చారు ముఖ్యమంత్రి. మధ్యంతర సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు అత్యవసరంగా సహాయం చేయాలి అని విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి. అలాగే నష్ట పరిహార అంచనాల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించండి అని లేఖలో ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అయితే అధిక వర్షాల కారణంగా ఏపీలో ముఖ్యంగా కడప, చిత్తూర్ లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా చాలా కట్టలు తెగిపోయాయి. అలాగే భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పటికి కూడా చాలా గ్రామాలు ఇంకా ఈ వరదల ముంపు నుండి బయటపడలేదు.

Exit mobile version