టీడీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా నుంచి చంద్రబాబు వేగంగా కోలుకోవాలని… ఆయన ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు చంద్రబాబు స్వయంగా మంగళవారం ఉదయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించిన సంగతి విదితమే.
Read Also: ఎన్టీఆర్ వర్థంతి రోజే చంద్రబాబుకు కరోనా… వైసీపీ ఎంపీ సెటైర్లు
మరోవైపు ఏపీలో కోవిడ్ పరిస్థితిపై సోమవారం సీఎం జగన్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఏపీలోని అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉంచామన్నారు. టెలీ మెడిసన్ ద్వారా కాల్ చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రికాషన్ డోస్ వేసుకునేందుకు ఇప్పుడున్న 9నెలల వ్యవధిని 6 నెలలకు తగ్గించేలా కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీని వల్ల ఫ్రంట్ లైన్ వర్కర్లకు, అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఉపయోగమని జగన్ అభిప్రాయపడ్డారు.
