Site icon NTV Telugu

వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు

వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అందజేయనుంది. రజక, నాయీబ్రహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న కానుకను ఈ ఏడాది కూడా అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా రూ.285.35 కోట్ల ఆర్థిక సాయంను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. రేపు బటన్ నొక్కి లబ్దిదారుల లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్‌ నగదును జమ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 చొప్పున ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందజేస్తోంది. షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్ల లబ్ధి చేకూరనుంది.

అంతేకాకుండా షాపులున్న 98,439 మంది రజకులకు రూ.98.44 కోట్ల లబ్ది అందనుంది. వీరితో పాటు షాపులున్న 40,808 మంది నాయీబ్రహ్మణులకు రూ.40.81 కోట్ల లబ్దిని ఏపీ ప్రభుత్వం అందజేయనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌ ‘జగనన్న చేదోడు’ కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టారు. అయితే గత సంవత్సరం జగనన్న చేదోడుతో ఎంతో మంది షాపులున్న రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలు లబ్దిపొందారు. అయితే ఇప్పుడు రెండోసారి జగనన్న చేదోడు లబ్దిదారులకు నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

Exit mobile version