Site icon NTV Telugu

నేడు సీఎం జగన్ ఒడిశా పర్యటన…

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పొరుగు రాష్ట్రం ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చించనున్నారు. కొఠియా గ్రామాలతోపాటు, నేరడి బ్యారేజీపై చర్చించనున్నారు. శ్రీకాకుళం, ఒడిశాలో రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు.


శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో.. రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఒడిశా సీఎంతో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్‌.. నవీన్‌ పట్నాయక్‌కు వివరించనున్నారు.

బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 56 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని చెప్పనున్నారు. జంఝావతి ప్రాజెక్టు వల్ల 24,640 ఎకరాల్లో సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని వివరించనున్నారు. అలాగే 21 కొఠియా గ్రామాల్లో 16..ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని నవీన్‌ పట్నాయక్‌కు వివరించనున్నారు జగన్మోహన్‌ రెడ్డి.

Exit mobile version