కర్నూలు జిల్లా ఆదోనిలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో విద్యాదీవెన కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పుష్పంజలి ఘటించారు. ఆదోని వేదికగా ఎంచుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం నాంది అవుతుందని అంటున్నారు.వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు సీఎం జగన్. దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలి. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి.పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బైజూస్ యాప్‌నుపేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కూడా అందజేస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. పిల్లల భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాది. విద్యాసంత్సరం ఆరంభంలోనే విద్యాకానుక అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్ విలువ రూ.2వేలు అని సీఎం జగన్ అన్నారు.
పేదరికం జయించాలంటే మంచి చదువు కావాలి. పిల్లలు బాగుండాలని, వారి జీవితాలు బాగుండాలని మనసావాచా కర్మణా కోరుకుంటున్నాను. అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం రావాలని, దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆదోనికి వరాలు ప్రకటించారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్నాం. ఆటోనగర్ చేయిస్తాం అని హామీ ఇచ్చారు. జగనన్న కాలనీల్లో బీటీ కాలనీలు ఇస్తాం. అదే విధంగా బుడగ జంగాలకు సర్టిఫికెట్లు ఇస్తాం. వన్ మేన్ కమిషన్ రికమండేషన్ ఇచ్చింది. దానిని ఎస్సీ కమిషన్ కి పంపాం. కేంద్రానికి తెలియచేశాం. బోయల విషయంలో ఇవే అడుగులు వేయబడతాయి. కేంద్రానికి పంపిస్తాం. ఆదోని రూరల్ లో తాగునీటి సదుపాయానికి సర్వే చేయిస్తాం. ఆదోని టౌన్ రోడ్లు విస్తరించడానికి 50 కోట్లు ఖర్చుచేస్తాం.అనంతరం జగనన్న కిట్లను విద్యార్ధులకు అందచేశారు. అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. జగన్ విద్యాదీవెన పథకంలో భాగంగా విద్యాకానుక ఎలా ఉపయోగపడుతుందో విద్యార్ధినీ విద్యార్ధుల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వారితో కలిసి కాసేపు ముచ్చటించారు. వారి పక్కనే కూర్చుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రావడంతో విద్యార్ధులు ఉద్వేగానికి గురయ్యారు. ఆదోని లో జగన్ రాకతో సందడి నెలకొంది. థ్యాంక్యూ జగన్.. జగన్ మామకు వందనం.. మీ పాలన మాకు వరం అంటూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు.
ఆదోని కి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు వచ్చారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ సీఎం హోదాలో వచ్చారు. ఆదోని సమస్యల్ని ఆయన దృష్టికి తెస్తున్నా. అందుకే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుచేయాలన్నారు. ఆటో నగర్ కావాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి జగన్ ని కోరారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కావాలన్నారు. జగన్ కాలనీలకు రోడ్లు, మంచినీళ్ళు ఇవ్వాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత జగన్ దే అన్నారు. విద్యారంగంలో సంస్కరణలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా 47 లక్షలమందికి పైగా విద్యార్ధులు ప్రయోజనం పొందుతారు. జగన్ ఆదోనికి రావడం సంతోషంగా వుందన్నారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఆదోనికి రావడంతో మంచిరోజులు వచ్చాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక పాదయాత్ర హామీలు నెరవేరుస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడంతో అంతా చర్చించుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజానురంజక పాలన సాగింది. రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ ఆయన బాటలోనే నడుస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా చేసినా జనం గురించి ఆలోచించలేదు. మేనమామగా జగన్ అందరినీ చదివించాలని పథకాలు చేపట్టారు. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నారు. మరో 30 ఏళ్ళు పాలించాలన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వరుసగా మూడో విడత విద్యాకానుకను అందిస్తున్నాం. 47 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాకానుకను ఇస్తున్నాం. విద్యాకానుక కోసం ఈ ఏడాది రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నేడు ఇచ్చే విద్యాకానుకతో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా రూ.2,368 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశాం. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని సీఎం చెప్పారు. ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లు. అక్టోబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.