CM Jagan: ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాలలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: ఏపీ సీఎం జగన్ జోరుగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత గుంటూరు మెడికల్ కళాశాలలో 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
Also Read
- Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
- YCP Protest: ఉరవకొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ!
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
ఈనెల 11న శుక్రవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరతారు. ఉదయం 9:25 గంటలకు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌కు చేరుకుంటారు. గంట పాటు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గుంటూరు మెడికల్ కాలేజీకి చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
తాజావార్తలు
-
Nani – Nithiin: 20 ఏళ్లలో ఎంత మార్పు.. ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు అదే హీరోకు నిర్మాతగా!
-
Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
-
Amazon Sale: అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.10 వేలు తగ్గింపు..
-
Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
-
SS Rajamouli: తన సినిమాల్లో బెస్ట్ మూవీ.. పర్సనల్ ఫేవరెట్ ఏదో చెప్పిన రాజమౌళి..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!