NTV Telugu Site icon

CM Jagan: ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాలలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

Cm Jagan

Cm Jagan

CM Jagan: ఏపీ సీఎం జగన్ జోరుగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత గుంటూరు మెడికల్‌ కళాశాలలో 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.

Read Also: Elon Musk-Twitter Deal Details: ట్విట్టర్‌ డీల్‌కి కావాల్సిన డబ్బులను ఎలాన్‌ మస్క్‌ ఎలా మేనేజ్‌ చేశాడంటే..

సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
ఈనెల 11న శుక్రవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరతారు. ఉదయం 9:25 గంటలకు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌కు చేరుకుంటారు. గంట పాటు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గుంటూరు మెడికల్‌ కాలేజీకి చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.