NTV Telugu Site icon

CM Jagan: రేపు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్

Cm Jagan

Cm Jagan

ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం టూర్ షెడ్యూల్‌ను ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ ఉ.10:40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడుకు సీఎం జగన్ చేరుకోనున్నారు. అక్కడ జిందాల్‌ ప్లాంట్ సమీపంలో హరిత నగరాల నమూనాను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ పైలాన్‌తో పాటు ప్లాంట్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు.

Somu Veerraju: జేపీ నడ్డా పర్యటన ఏపీలో తీవ్ర ప్రభావం చూపుతోంది

కాగా సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సర్వే ప్రగతిని సమీక్షించారు. భూ వివాదాలను పరిష్కరించడం సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని సీఎం జగన్ తెలిపారు. సమగ్ర సర్వే ద్వారా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని.. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవాలన్నారు. సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. 100 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోందని.. ఈ సర్వేను పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.