ఈనెల 21న ఏపీ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం జగన్ ఉదయం 10:50 గంటలకు బలభద్రపురంలోని గ్రాసిం పరిశ్రమ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11:05 గంటలకు పరిశ్రమ ప్లాంట్‌కు చేరుకుని 15 నిమిషాలపాటు పరిశ్రమను పరిశీలించనున్నారు. ఉదయం 11:25 గంటలకు పరిశ్రమను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:25 గంటలకు తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లి బయలుదేరుతారు. కాగా గురువారం నాడు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
CM Jagan: విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుల మార్పుపై కీలక ప్రకటన