Site icon NTV Telugu

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

అమరావతి : దేశ రాజధాని ఢిల్లీకి సీఎం జగన్ మరోసారి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఎల్లుండి వామపక్ష తీవ్రవాదం పై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో సమావేశం జరుగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న ఈ సమావేశం జరుగనుంది. ఇక ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యం లోనే రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం జగన్‌. ఇక ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, ఒడిస్సా, చత్తీస్‌ ఘడ్, జార్ఖండ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌ మరియు యూపీ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కాగా.. ఈ సమావేశం నేపథ్యం లోనే ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు.

Exit mobile version