Site icon NTV Telugu

సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో కోవిడ్ హాస్పిటల్ నిర్మాణం…

సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో తాడిపత్రిలో యుద్ధప్రాతిపదికన 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రి నిర్మించారు. మరి కాసేపట్లో వర్చువల్ ద్వారా తాడిపత్రి కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్… 5.50 కోట్ల రూపాయల వ్యయంతో 13.56 ఎకరాల్లో కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం చేసారు. జర్మన్ హ్యాంగర్ విధానంలో ఆసుపత్రి నిర్మించారు. దీంతో రాయలసీమ కోవిడ్ బాధితులకు అందుబాటులోకి మరిన్ని ఆక్సిజన్ బెడ్స్ రానున్నాయి. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రి లో కోవిడ్ హాస్పిటల్ ను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆక్సిజన్ ఆధారంగా నిర్మించారు.

Exit mobile version