ఏపీ సీఎం వైయస్ జగన్ నేడు తిరుపతి పర్యటనకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు జగన్. పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. తిరుపతి సమీపంలోని పాత కాలవ గ్రామం పేరూరు బండపై వెలసిన వకుళ మాత ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. వందల ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న వకుళ మాత ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఆలయం దశ మారిందనే చెప్పాలి.
హైదర్ అలీ దండయాత్రలో ధ్వంసమైంది ఈ ఆలయం. సొంత నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వకుల మాత ఆలయానికి పూర్వవైభవం తీసుకువస్తామని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు. ఇవాళ్ళి నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తన పర్యటనలో జగన్ రూ.3644 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న ఎనిమిది పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుడతారు.
శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు గ్రామంలో అపాచీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో 700 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుకానుందిఈ అపాచీ పరిశ్రమ. దీనివల్ల 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దీంతో పాటు, ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో 1230 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న టీసీఎల్ కంపెనీ భూమి పూజ కార్యక్రమంకు సిఎం జగన్ హాజరవుతారు. 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో మరో ఆరు పరిశ్రమల ఏర్పాటు శంకు స్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం వైఎస్ జగన్. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు.
CM Jagan: ఏపీలో రహదారుల మరమ్మతులు వేగవంతం చేయాలి