ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan Mohan Reddyపశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఘాటైన విమర్శలు చేశారు. నరసాపురంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చంద్రబాబు తన 45ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా గత పాలకుల ఊహకు అందని విధంగా ఈ వర్గాలు అన్నింటికీ తోడుగా నిలిచాం అన్నారు. తన పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయలేదు చంద్రబాబు. ఆయన, దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక పోతున్నారు. చెప్పుకో దగ్గది ఏదీ చేయలేదని తెలిశాక.. తమ నోటికి ఈ మధ్య ఎక్కువగా పని చెప్తున్నారు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు.
Read ALso: Ranveer Singh meets Akon: నువ్వు ఎవరో తెలియదు… రణ్‌వీర్ కి షాక్ ఇచ్చిన రిపోర్టర్
దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారు. ఇదేం ఖర్మరా బాబూ అనుకోబట్టే.. 2019లో దత్త పుత్రుడ్ని, సొంతపుత్రుడ్ని.. అన్నిచోట్లా ఓడించారు. చంద్రబాబుకు బైబై చెప్పారు. కుప్పంలో కూడా మనకు ఓటు వేశారు. టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బైబై బాబూ అనికూడా చెప్పారు అన్నారు జగన్. అందుకే… చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబూ అని తన తలపట్టుకుని తాను కూర్చున్నాడు. ఆయన పుత్రుడు, ఆయన దత్తపుడ్రుకూడా ఈ బాబుతో ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇదేం ఖర్మంరా బాబూ అని అనుకుని ఉంటాడు. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండడం ఇదేం ఖర్మరా బాబూ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు అన్న మాటలు… తాను రాజకీయాల్లో ఉండాలంటే… అసెంబ్లీకి వెళ్లాలంటే.. ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. సరేసరి..అని ప్రజల్ని కూడా బెదరిస్తున్నాడు. చివరకు కుప్పంలోనే గెలవలేనన్న భయం, నిరాశ, నిస్పృహలు.. చంద్రబాబు మాటల్లో, చేష్టల్లో కనిపిస్తున్నాయి. ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తున్న తీరును చూస్తున్నప్పుడు సెల్‌ఫోన్ టవర్‌నుంచి దూకేస్తానంటారు..
రైళ్లకింద పడిపోతానంటారు.. పురుగులమందు తాగేస్తానంటారు. చంద్రబాబు అధికార భగ్నప్రేమికుడు. రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నాడు. చేయని పనులకు ఎందుకు ప్రజలు .. ఓటేస్తారు. ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. వాళ్లకు సంబంధించిన నాలుగు పేపర్లు, టీవీలు.. ఇలాంటి వాళ్లందరితో వీళ్లంతా కూడా దోచుకో… పంచుకో.. తినుకో.. అని ఒక ఒప్పందం చేసుకుంటారు. చంద్రబాబు దోచుకోవడం.. వీళ్లందరితోనూ పంచుకోవడం. ప్రశ్నిస్తానన్న కొందరు ప్రశ్నించరు. వీళ్లందరిన్నీ చూసినప్పుడు ఇదేం ఖర్మరా బాబూ అని అనిపిస్తుంది. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అని కొలమానంగా చూసుకోండి. మంచి జరిగితే.. మీ తమ్ముడికి, మీ అన్నకి, మీ బిడ్డకి తోడుగా నిలబడండి. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే ఒక్కటే కొలమానంగా తీసుకోండి అన్నారు జగన్.
Read ALso: Ranveer Singh meets Akon: నువ్వు ఎవరో తెలియదు… రణ్‌వీర్ కి షాక్ ఇచ్చిన రిపోర్టర్