నెల్లూరు జిల్లా పర్యటనలో సీఎం జగన్ ఆత్మకూరు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తిచేశాం. వీటిని జాతికి అంకితం చేశాం.. 5 లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించాం. ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కావలి నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. దేవుడి దయవల్ల వరుసగా నాలుగో ఏడాదికూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయన్నారు. రైతన్నల మోములో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. నాలుగేళ్లలో ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని హర్షం వ్యక్తం చేశారు.
దేవుడి దయతో మంచి వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తోంది. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీని, మరికాసేపట్లో నెల్లూరు బ్యారేజీని అంకితం చేస్తున్నాం. 3.45లక్షల ఎకరాలకు వర ప్రదాయిని అయిన సంగం బ్యారేజీని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా మన ప్రభుత్వం గుర్తించి నిర్మాణాల్లో వేగం పెంచింది. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 9 నెలలుకూడా తిరగకముందే కరోనా సమస్య వచ్చింది. ఈ సమస్యను అధిగమిస్తూ , మరోవైపున వరుసగా పెన్నానదిలో రెండేళ్లపాటు వరదలు వచ్చినా ఎదుర్కొని ప్రాజెక్టు పనుల మీద దృష్టి పెట్టాం అన్నారు.
Read Also: Dengue Danger Bells: ఏజెన్సీపై డెంగీ పడగ.. ఆస్పత్రుల్లో బెడ్ లు నిల్
అక్షరాల రూ.320 కోట్లకు పైగా ఈరెండు బ్యారేజీలకు ఖర్చు చేశాం. బ్రిటిష్ వారి హయాంలో కట్టిన ఈ ఆనకట్ట కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. అప్పట్లో ఏ ఒక్కరూ కూడా నెల్లూరు జిల్లాకు మంచి చేయాలని ఆలోచన చేయలేదు.ప్రియతమ నాయకుడు, వైయస్సార్ సీఎం అయిన తర్వాతనే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది. యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు అయ్యాయి. 2006లో పనులు మొదలు పెట్టారు. ఆ పెద్దాయనకు కొడుకుగా, ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్లీ ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టును నేను పూర్తి చేశానని చెప్పడానికి గర్వపడుతున్నాను.
ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. నాన్నగారు హఠాన్మరణం తర్వాత ఈ బ్యారేజీలను గాలికి వదిలేశారు. 2014లో మళ్లీ రాష్ట్రం విడిపోయాక.. ఇక్కడ ప్రభుత్వం వచ్చింది. వచ్చాక.. ఈ బ్యారేజీ పనులకోసం కేవలం రూ.30 కోట్ల 85లక్షలు ఖర్చుచేసి చేతులు దులుపుకున్నారు. 2017 నాటి అని, 2018 నాటికి అని, 2019 నాటికి అని చెప్పి.. మహూర్తాల మీద మహూర్తాలు పెట్టుకుంటూ మార్చుకుని పోయారు. వారు చేసిందల్లా రేట్లు పెంచి, కమీషన్లు దండుకోవడమే చేశారన్నారు జగన్.
చంద్రబాబు హయాంలో ఇలాంటి అడుగులు చూశాం. ఇదే సంగం బ్యారేజీకి అక్షరాల రూ.200 కోట్లు ఖర్చుచేశాం. బ్యారేజీని పూర్తిచేసి నా స్నేహితుడు, ఆత్మీయుడు మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. ఇవాళ నిజంగా గౌతం ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. గౌతం పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని బ్యారేజీకి పేరు పెట్టాం. గౌతం సంస్మరణ కార్యక్రమంలో చెప్పిన మాటను నిలుపుకుంటూ.. ఇవాళ బ్యారేజీకి పేరుపెట్టి, జాతికి అంకితం చేస్తున్నాం. నెల్లూరు బ్యారేజీకి కోసం ఆ రోజు వైయస్సార్‌గారే.. సుమారు రూ.80 కోట్లుకు పైగా ఖర్చు చేశారన్నారు.
ఆయన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. ఇవాళ దాన్ని కూడా పూర్తిచేసి జాతికి అంకితం చేస్తున్నాం. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. 26 ప్రాజెక్టులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ ప్రాధాన్యత కింద తీసుకున్నాం. వీటికి సంబంధించి పనులుకూడా వేగంగా చేసి పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు జగన్. రైతన్నలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాం. వివిధ పనులకు సంబంధించి ఎమ్మెల్యే విక్రం రెడ్డి అడిగిన నిధుల్ని జగన్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.నియోజకవర్గంలో సమస్యలు ప్రస్తావించారు ఎమ్మెల్యే విక్రం రెడ్డి. బ్యారేజీకి జాతీయ రహదారి కి మధ్య రోడ్డు కోసం 16 కోట్లు, రోడ్లు లేని గ్రామాలకు 14 కోట్లు శాంక్షన్ కూడా ఇస్తామన్నారు జగన్. ఆత్మకూరుకి స్పెషల్ గ్రాంట్ కింద డబ్బులు ఇస్తాం. అన్నీ రకాల పనులకు పచ్చజెండా ఊపారు జగన్.ఆత్మకూరు అభివృద్ధి కి రూ.85 కోట్లు మంజూరు చేశారు జగన్. ఆత్మకూరు మునిసిపాలిటీ కి రూ. 12 కోట్లు స్పెషల్ గ్రాంట్ గా కేటాయిస్తున్నాం. సంగం పంచాయితీ కి రూ. 4 కోట్లు ఇస్తున్నాం అన్నారు జగన్.
Read Also: Suresh Raina: బాంబ్ పేల్చిన రైనా.. ఐపీఎల్‌కు గుడ్ బై
