గృహ నిర్మాణ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం సమీక్షించారు. ఆప్షన్ –3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్‌ఓపీని పాటించాలి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉండాలి. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలి.
Jhanvi Narang : ఆసియన్ సునీల్ కి ఖేదంలో మోదం
ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలి. జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. డ్రైనేజి, కరెంటు, నీటి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండాలి. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దు. జగనన్న కాలనీల రూపంలో కొన్ని చోట్ల ఏకంగా మున్సిపాల్టీలే తయారవుతున్నాయి. లాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. ర్మాణ నాణ్యతపై అధికారులు ప్రతి దశలోనూ దృష్టి పెట్టాలి:
90 రోజుల్లో పట్టాలు పంపిణీ పై సీఎం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారునికి కేవలం ఎక్కడ ఇంటి స్థలం ఇచ్చింది చూపడమే కాదు, పట్టా, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఇవ్వాలన్నారు. స్థలం ఇచ్చారని, దానికి సంబంధించిన పట్టా, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారులనుంచి ధృవీకరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్.
Pawan Kalyan: ఖుషీగా త్రివిక్రమ్ ఆవిష్కరించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్!