NTV Telugu Site icon

CM Jagan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పొదుపు సంఘాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచాయి

Ys Jagan Speech

Ys Jagan Speech

CM Jagan Released YSR Asara Funds In Eluru Denduluru Tour: ఏలూరు జిల్లా దెందులూరు పర్యటనలో భాగంగా.. వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ శనివారం నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు.. 10 రోజుల వరకు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్లను జమ చేయనున్నారు. దీని ద్వారా పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది మహిళలకు లబ్ది చేకూరనుంది. ఇప్పటివరకు ఈ వైఎస్సార్ ఆసరా పథకం కింద జగన్ సర్కార్ మొత్తం రూ. 19,178 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మాట్లాడుతూ.. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని, మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. మహిళలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోందని.. వ్యాపార దిగ్గజాలతో ఒప్పందం చేసుకొని వ్యాపార మార్గాలు చూపామని.. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచామని చెప్పారు.

Rahul Gandhi: ప్రధాని కళ్లలో భయం చూశా.. అందుకే నాపై అనర్హత వేటు

పొదుపు సంఘాల పనితీరు అద్భుతంగా ఉందన్న సీఎం జగన్.. పొదుపు సంఘాల మహిళలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారని కితాబిచ్చారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లు అందించామని.. మూడో విడతలో భాగంగా 78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాన్ని తగ్గిస్తున్నామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో మీ ఇష్టమన్నారు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా.. ఈరోజుల బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయని వివరించారు. 99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారని వెల్లడించారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించామన్న ఆయన.. ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. ఇ్పుడు మళ్లీ ఊపిరి పోసుకుందని పేర్కొన్నారు.

Robot Man Of India: ‘రోబో మ్యాన్ ఆఫ్‌ ఇండియా’.. పీఎస్‌వీ కిషన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

గత ప్రభుత్వ హయాంలో ఎన్‌పీఏలు, ఓవర్‌ డ్యూలు 18.36 శాతం ఉండగా.. వైసీపీ హయాంలో 0.45 శాతానికి తగ్గాయని సీఎం జగన్ తెలిపారు. గత ఎన్నికల్లో రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచేశారని ఆరోపించారు. 2016 అక్టోబరు నుంచి సున్నా వడ్డీరుణాల పథకాన్ని సైతం చంద్రబాబు నిలిపేశారని.. దాంతో రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ పథకాన్ని తీసుకొచ్చి, రూ.3600 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం.. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేసిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.2,25,330.76 కోట్లు మహిళలకు ఇచ్చామన్నారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించామని.. 9 లక్షల మందికిపైగా మహిళలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.