అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు, ధర్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా అని ప్రశ్నించారు. 1956-2014 వరకు 58 ఏళ్లలో చంద్రబాబు ఏ ఉద్యమం చేయలేదు. వెయ్యి రోజులుగా కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు?. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ తెలిపారు.
పరిపాలన వికేంద్రీకరణపై సీఎం జగన్ మాట్లాడారు. ప్రతిప్రాంతం బాగుండాలని, అమరావతిపై తనకేం కోపం లేదన్నారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తీసుకో అనే డీపీటీ పథకం అమలైంది. ఒకటే రాజధానిగా అమరావతి సాధ్యమయ్యే పనేనా? అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎవరు కొంటారు. ఎకరా 10 కోట్లకు ఎవరు కొంటారని మీరే అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని ఎలా అవుతుంది. తాను అభివృద్ది చేయని, చేయలేని ప్రాంతంలో చంద్రబాబు ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళ దృష్టిలో అమరావతి ఒకటే రాజధాని ఎలా అవుతుంది. విశాఖలో రోడ్లు వున్నాయి.. డ్రైనేజీ, కరెంట్ వుంది.. విశాఖపై నాకేం ఎక్కువ ప్రేమ లేదు.. ప్రజలందరిపై ప్రేమ వుంది. విశాఖ ఏపీలో బిగ్గెస్ట్ సిటీ. అమరావతికి లక్షల కోట్లు ఎలా ఖర్చుపెట్టగలం. 10వేల కోట్లు పెడితే విశాఖ డెవలప్ అవుతుందన్నారు సీఎం జగన్.
Read Also: Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం
బాబు చేయలేదు.. ఎవరూ చేయలేని దానిని మనం చేయాల్సిందేనని డ్యాన్స్ లు, ధర్నాలు చేస్తున్నారు. మనమీద దుర్బుద్ధితో డ్రామాలాడుతుంటే ప్రజలు ఆలోచించాలి. విశాఖను పక్కన పెడదాం.. ఇదే విజయవాడకు ఏం చేశారో అడుగుదాం. మన ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంత అభివృద్ధి మీద ఎంత శ్రద్ధ పెట్టామో అందరికీ తెలియాల్సి వుంది. వెస్ట్రన్ బైపాస్ నడుస్తోంది. గన్నవరం చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం. 17 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 65 శాతం నిధులు ఖర్చుచేశాం. ఐదేళ్ళలో విజయవాడకు ఎందుకు చేయలేకపోయారన్నారు సీఎం జగన్.
నవరత్నాల ద్వారా రూ.లక్షా 65వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించాం. అవినీతికి తావులేకుండా నేరుగా అకౌంట్లలో వేశాం. చంద్రబాబు హయాంలో రైతుభరోసా ఎందుకు లేదు?. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?. 21 లక్షల ఇళ్లు ఎందుకు నిర్మించలేదు?. బాబు హయాంలోనూ, ఇప్పుడు ఒకే బడ్జెట్ ఉంది.. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి?. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు ఎందుకివ్వలేదు?. ఆనాడు దోచుకో పంచుకో తినుకో అన్నట్లు సాగింది. అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు.. ఎందుకు కోపం ఉండాలి?. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష. అమరావతి అటు గుంటూరుకు, ఇటు విజయవాడకు దూరంగా ఉంది. ఆ ప్రాంతంలో కనీస వసతి సౌకర్యాలు లేవు. ఎకరాకు రూ.2కోట్ల చొప్పున ఖర్చవుతుందని బాబే చెప్పారు.