Site icon NTV Telugu

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్‌ ఇవ్వాలని… క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు కూడా.. నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని… గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్స్‌ జరిగే చూడాలని పేర్కొన్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ 20 నుంచి ప్రారంభం కానుందని… డిసెంబర్‌ 15 వరకూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం జగన్. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version