CM Jagan inaugurated Juvvaladinne fishing harbour today: చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఏకంగా రూ.3.793 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లలో మొదటి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగిస్తున్న రాష్ట్ర మత్స్యకారుల పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. నేడు రాష్ట్రంలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ జువ్వలదిన్నె హార్బర్ ను ప్రారంభించనున్నారు. ఈ హార్బర్ ద్వారా ఏకంగా 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
Geetanjali Suicide Case: గీతాంజలి ఫ్యామిలీకి అండగా సీఎం జగన్.. రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఇందులో 1250 బోట్లను నిలిపేలా ఈ హార్బర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో వారు తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ప్రతి సంవత్సరం 41 వేల టన్నుల మత్స్య సంపద అదనంగా రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. ఈ పోర్టుల నిర్మాణంతో ఎక్కువ మొత్తంలో మత్స్యకారుల ఉపాధి, అలాగే అతి తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునేలా అవకాశం లభిస్తుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలో భాగంగా ఓఎన్బీసీ పైన్ నిర్మాణం చేయడంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాల వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. ఇందులో భాగంగా 6 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 69 వేల చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని ఐదో విడత నష్టపరిహారం సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.