ఏపీలో మునిసిపల్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్సారు. మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు పచ్చజెండా ఊపారు ముఖ్యమంత్రి జగన్. దీంతో 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెరగనున్నాయి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు. ఆక్యుపేషన్ అలవెన్స్ పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయం వెల్లడించారు. ఇవాళ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యిందని, మున్సిపల్ కార్మికుల సమస్యల పై చర్చించాం అని చెప్పారు.
ఆక్యుపేషన్ అలవెన్స్ పై చర్చ జరిగిందని, జీతాలు పెరిగిన తర్వాత కూడా ఆక్యుపేషన్ అలవెన్స్ పెంచాలని మున్సిపల్ కార్మికులు కోరారు. ఆక్యుపేషన్ అలవెన్స్ 6 వేలు యథాతధంగా ఉంచడానికి సీఎం అంగీకరించారు. జీతానికి అదనంగా 6వేలు అలవెన్స్ కలిసి 21 వేలు జీతం కార్మికులకు వస్తుంది. కార్మికులను సమ్మె విరమించాలని కోరుతున్నాం అన్నారు. అనంతరం రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్‌లతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. వర్చువల‌్‌గా ద్వారా మాట్లాడారు మంత్రి సురేష్.
పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపారు. పారిశుధ్య పనుల్లో ఎక్కడెక్కడ ఎంతమంది పాల్గొంటున్నారు? తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలను కమిషనర్ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు మంత్రి. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట ప్రయివేట్ ఏజెన్సీ ల ద్వారానైనా పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు మంత్రి సురేష్.
