Site icon NTV Telugu

CM Jagan : ఏపీలో ఒబెరాయ్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టడం సంతోషం

Cm Jagan

Cm Jagan

కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. పులివెందులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సీఎం జగన్‌. ఈ నేపథ్యంలోనే.. వైఎస్సార్‌ జిల్లా గండికోటలో ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు సీఎం జగన్‌. భోగాపురం బీచ్ కారిడార్ లో తొలి ఆతిథ్య, టూరిజం ప్రాజెక్ట్ ఇది. 350 కోట్ల తో 40 ఎకరాల్లో ఒబారాయ్ గ్రూప్ అధ్వర్యంలో రిసార్ట్స్.. సెవెన్ స్టార్ హోటల్ నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు.

Also Read : Bholaa Shankar: మెగాస్టార్ జజ్జనక వేస్తే… థియేటర్స్ మోత మోగాల్సిందే

2023 లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వంతో ఒబెరాయ్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఒబెరాయ్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టడం సంతోషమన్నారు. ఒబెరాయ్‌ గ్రూప్‌ ఇక్కడ సెవెన్‌ స్టార్‌ హోటల్‌ కడుతోందని, ఒబెరాయ్‌ సంస్థ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుంది. ఒబెరాయ్‌ సెవెన్‌ స్టార్స్‌ హోటల్స్‌ ద్వారా ఉపాధి అవకాశాలు కలుగుతుంది. గండికోటకు మరో స్టార్‌ గ్రూప్‌ను కూడా తీసుకొస్తాం. కొప్పర్తి డిక్సన్‌ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు. కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు(సోమవారం) ఎంవోయూలు చేసుకుంటాం. గండికోటలో గోల్ఫ్‌ కోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఒబెరాయ్‌ని కోరా. త్వరలో కడప స్టీల్‌ఫ్యాక్టరీకి ఎన్విరాన్మెంట్‌ క్లియరెన్స్‌ రాబోతుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

Also Read : Kerala: ఆ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. ప్రసాదంగా పెసర గుడాలు..

Exit mobile version