NTV Telugu Site icon

ఢిల్లీలో సిఎం జగన్ వరుస భేటీలు : షెడ్యూల్ ఇదే

ys jagan

ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కాసేపట్లో వెళ్లనున్నారు. అయితే.. ఢిల్లీ పర్యటనలో సిఎం జగన్ వరుస భేటీలతో ఫుల్ బిజీ కానున్నారు. ఈ పర్యటనలో హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుసుకోనున్నారు సీఎం జగన్. ఈ సందర్బంగా పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించినున్నారు సీఎం జగన్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్న సీఎం జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏడు గంటలకు భేటి కానున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో 9 గంటలకు కీలక భేటీ కానున్నారు. పోలవరం నిధులు, విభజన హామీలు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై అమిత్ షాతో సీఎం చర్చించే అవకాశం ఉంది. రేపు ఉదయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్.

Show comments