Site icon NTV Telugu

సోమవారం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌..

ys jagan

కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై సీఎం జగన్ చర్చిం చనున్నారు. అంతేకాదు ప్రధాని అపాయింట్ ను కూడా సిఎం జగన్ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో వైపు వ్యాక్సిన్ విషయంలో సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయటం, రఘురామ ఎపిసోడ్ నేపధ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version