Site icon NTV Telugu

CM Jagan: ముగిసిన ఢిల్లీ టూర్.. పలు అంశాలపై చర్చ

Cm Jagan

Cm Jagan

హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌.జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్‌జోనల్‌ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు – వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశంకూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూరై్తనా ఇప్పటికీ ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ కూడా పెండింగులో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం మరోమారు హోంమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీంతోపాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపైనకూడా సీఎం, హోంమంత్రితో చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం వైఎస్‌.జగన్‌ తిరిగి తాడేపల్లి చేరుకున్నారు.

విశాఖలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడించారు. గ్యాస్‌ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు. గ్యాస్ లీక్ లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రెండు వందల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు ప్రాథమిక చికిత్స అనంతరం అనకాపల్లి,వైజాగ్ ఆసుపత్రులకు తరలించారు.

అమోనియా గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ ఎక్కడ జరిగిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్నామని ఎస్సీ గౌతమి శాలి తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు పరిశీలించాలని మంత్రి అమర్నాథ్‌ కి సూచించారు సీఎం జగన్.

Jagadish Reddy: మాకు మేమే పోటీ..

Exit mobile version