Site icon NTV Telugu

సీజేఐకు గవర్నర్ తేనీటి విందు… హాజరైన సీఎం జగన్

ఏపీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఇచ్చారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ వర్గాలు సాదర స్వాగతం పలికాయి.

కాగా శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎన్వీ రమణకు టీ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు కృష్ణా జిల్లా గుంటుపల్లిలో జస్టిస్ ఎన్వీ రమణకు విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ వినీత్ శరణ్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కోకా సుబ్బారావు తర్వాత 60 ఏళ్లకు ఓ తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడని జస్టిస్ ఎన్వీ రమణను కొనియాడారు.

Exit mobile version