CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ (Data Driven Governance) అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు ఆయన సీరియస్ వార్నింగ్ జారీ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలపై సమీక్ష నిర్వహించిన సీఎం, పనితీరు మెరుగు పరచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ (Animal Husbandry) పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, “గత ఐదేళ్లలో పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పశువుల సంఖ్య తగ్గడం ఎందుకు జరిగింది? ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో వివరించండి,” అని అధికారులను ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పిన అధికారులను ఆయన మందలించారు.
Kodanda Reddy: మాట నిలబెట్టుకున్న కోదండరెడ్డి.. వ్యవసాయ శాఖకు రాసిచ్చిన 4 కోట్ల విలువైన భూమి!
“ఫస్ట్ క్వార్టర్‌లో డ్రై సీజన్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గిందంటారా? ఇది సమాధానం కాదు. మిమ్మల్ని మళ్లీ రమ్మనడం చెప్పడం జరగదు. ప్రతి అధికారి తన బాధ్యత తీసుకోవాలి,” అని సీఎం కఠిన హెచ్చరిక జారీ చేశారు. అగ్రికల్చర్ ఎకానమీపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. “మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అయితే రైతుల ఆదాయం తక్కువగా ఉంది. ఆదాయం తగ్గకుండా చూడాలి,” అని అన్నారు.
ఆరోగ్య శాఖ పనితీరు పట్ల కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ శస్త్రచికిత్సలు అధికమవుతున్నాయి. వాటిని తగ్గించే చర్యలు తీసుకోవాలి,” అని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా.. “రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 8 లక్షల మంది పాఠశాలల్లో ఉన్నారు. ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచాలి. విద్యా రంగంలో నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలి,” అని సీఎం సూచించారు. “కొన్ని శాఖలు బాగా పనిచేస్తున్నాయి. కానీ కొన్ని శాఖలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏడాదిన్నర పాలన పూర్తవుతోంది. ప్రతి రోజు పనిపై దృష్టి పెట్టాలి. రీబిల్డింగ్ మొదలు పెట్టాలి,” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
