Site icon NTV Telugu

CM Chandrababu: నాకు ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామినే..

Cbn

Cbn

CM Chandrababu: అమరావతి రాజధాని వెంకటాపాలెంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వర స్వామి సంకల్పం ఇచ్చాడు.. శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తుని గానే ఉంటాను అన్నారు. కృష్ణానది తీరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశాం.. దేవతల రాజధాని అమరావతి లానే.. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఉంటుంది.. 2003లో క్లైంబర్ మెయిన్స్ పెట్టినా నాకు ప్రాణ బిక్ష పెట్టిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు.. ఇక్కడ ఏ తప్పు జరగనియను.. తప్పు చేసిన వారిని వెంకటేశ్వరుడు వదిలి పెట్టడు.. గత ప్రభుత్వం విధ్వంసం చేసింది.. అమరావతి రైతులకు నరకం చూపించారు.. అమరావతి నుంచి దేవాలయం అనే పాదయాత్ర చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: TGPSC Group 2 Case: గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. 2015 గ్రూప్‌-2 ర్యాంకర్లకు ఊరట

అయితే, రైతులను అభినందిస్తున్నా.. ఇక్కడ ప్రాంతాన్ని కాపాడమని దేవుణ్ణి కోరుతున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 240 కోట్ల రూపాయలతో తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుందో…అలాగే అమరావతిలో దేవాలయం నిర్మాణం చేపడుతారు.. NTR అన్నదానం ప్రారంభిస్తే, నేను ప్రాణ దానం ప్రారంభించా.. మన అందరినీ దీవించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.

Exit mobile version