CM Chandrababu: మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలిసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారు.. తమ జిల్లా పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదే.. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇంఛార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలని సూచించారు. శాఖా పరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలి.. చరిత్రలో తొలిసారి 93 శాతం రిజర్వాయర్లు నీటిని నింపాం.. విజన్ 2047కు పెట్టుకున్న 10 ప్రిన్సిపల్స్ లో ఇదో కీలక పరిణామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: UP: సినిమా రేంజ్‌లో కాల్పులు.. హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్
అయితే, చామ్ విధానంలో పట్టణాభివృద్ధి చేపట్టిన నిర్మాణాలు ఇతర శాఖలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పూర్వోదయ పథకంలో ఏపీకి స్థానం లభించిన విషయాలు మంత్రులతో పంచుకున్నారు. ఏ పథకం ద్వారా దాదాపు రూ. 65 వేల కోట్లు ఉద్యాన, ఆక్వా రంగాలకు వచ్చే అవకాశం ఉంది. యానిమల్ హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.. విజయవాడ ఉత్సవ్ తరహాలో నెలకో ఈవెంట్ రాష్ట్రంలో స్థానిక పండుగల్ని ప్రోత్సహించేలా అన్ని ప్రాంతాల్లో చేపట్టాలి అన్నారు. కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమ 2028కల్లా పూర్తి చేస్తాం.. కర్నూల్ లో ఈ నెల 16వ తేదీన ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
