CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు (అక్టోబర్ 22) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 3 రోజుల పర్యటనకు వెళ్తున్నారు. ఈ టూర్ ప్రధానంగా దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో కొనసాగనుంది. ఈ పర్యటన ద్వారా ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించడమే లక్ష్యంగా వెళ్తున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీఎం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. ఈ టూర్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పోర్టులు, షిప్ మేనేజ్‌మెంట్ లాంటి కీలక రంగాల్లో పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
Read Also: Tamilnadu Rain: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ
అయితే, ఈ రోజు ఉదయం 7.30కి ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇక, ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్ విమానంలో బయలుదేరనున్నారు. దుబాయ్‌లో ఉదయం 11 గంటల సమయంలో ల్యాండింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అనంతరం వన్-టు-వన్ మీటింగులు స్టార్ట్ అవుతాయి. ముఖ్యమంత్రి మొదట భారత రాయబారి కార్యాలయంలో ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి బీసీ జనార్దన రెడ్డి, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సీఎం కార్యాలయ సీక్రటరీ, పరిశ్రమల విభాగం సీక్రటరీ, ఏపీఈడీబీ సీఈఓ, రతన్ తాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ కూడా ఈ పర్యటనలో ఉంటారు.
