Site icon NTV Telugu

CM Chandrababu: నేడు వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి సీఎం చంద్రబాబు..

Babu

Babu

CM Chandrababu: ఇవాళ అమరావతి రాజధాని ప్రాంతంలో వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ చేయనున్నారు. రెండు దశల్లో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహా రాజగోపురం, మండపాలు, ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10.30 కు శంకుస్థాపన చేయనున్నారు.

Read Also: RSV Infections: చలికాలంలో శ్వాసకోశ సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా..

అయితే, రూ.260 కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది. మొదటి దశలో రూ.140 కోట్లు వ్యయంతో వివిధ పనుల్ని చేపట్టనున్న టీటీడీ.. అనంతరం మరో 92 కోట్ల రూపాయలతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మాణం జరగనుంది. వీటి నిర్మాణాలకు రూ.48 కోట్లు ఖర్చు అవుతుంది. రెండోదశ పనులకు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయం కానుంది. శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనుల నిర్మాణం చేయనున్నారు.

Exit mobile version