Site icon NTV Telugu

CM Chandrababu: తన తమ్ముడి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు

Cbn

Cbn

CM Chandrababu: తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. తన తమ్ముడి పార్థివదేహానికి నివాళి అర్పించారు. నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసిన చంద్రబాబు చలించిపోయారు. ఆ అనంతరం మాట్లాడుతూ… తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని వాపోయారు. తమ నుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడన్నారు.

Read Also: Anupama : సెట్‌లో భారీ ప్రమాదం.. కెమెరామెన్ మృతి

అలాగే, ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో తమ్ముడు రామ్మూర్తి నాయుడు ప్రజలకు సేవ చేశాడని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని స్వగ్రామం నారావారి పల్లెకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారి పల్లెలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తి నాయుడి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Exit mobile version