CM Chandrababu : తిరువూరు… పంచాయతీ.. నివేదిక సీఎం చంద్రబాబు కు చేరింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీస్కుంటామన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ క్రమ శిక్షణా సంఘంతో చంద్రబాబు భేటి అయ్యారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న కోల్డ్‌వార్‌పై ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్దం చేసిన నివేదిక సీఎం చంద్రబాబుకు చేరింది. విచారణలో భాగంగా ఇద్దర్నీ ప్రశ్నించింది కమిటీ. ప్రధానంగా తన టికెట్ కోసం 5 కోట్లు అడిగారన్న అంశంపై ఎంపీ చిన్నిని వివరణ అడిగింది. రెండు సందర్భాల్లో కొలికపూడి వివరణను కూడా తీసుకుంది. ఇద్దరి అభిప్రాయాలు, వారు సమర్పించిన ఆధారాలను నివేదికలో పొందుపర్చిన క్రమశిక్షణా కమిటీ.. ఆ రిపోర్ట్‌ను చంద్రబాబుకు సమర్పించింది. సుమారు గంటపాటు చంద్రబాబుతో భేటీ అయ్యింది క్రమ శిక్షణా కమిటీ.
Jagga Reddy: కేటీఆర్ మాటలు నమ్మకండి.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
తిరువూరు ఎమ్మెల్యే ఆరోపణలకు సరైన ఆధారలు లేవని కమిటీ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. కొలికపూడి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం. ఆయన మాటల్లో పొంతన లేదని నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఒక స్ల్పిట్ పర్సనాలిటీతో కొలికపూడి ఉన్నట్టుగా, ఆయన గందరగోళ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ కు సంబంధించి కూడా నివేదికలో చేర్చారు. క్రమ శిక్షణా కమిటీ నివేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారని సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు.
కొంతమందికి టికెట్లు ఎందుకు ఇచ్చానా అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా..? లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. అంతర్గత విభేదాలపై బహిరంగ ఆరోపణలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Soundbar: boAt, Zebronics సౌండ్‌బార్ల పై కళ్లు చెదిరే ఆఫర్స్.. రూ.1000 కంటే తక్కువ ధరకే
